ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమెరికాలో మంచు తుపాను మిగిల్చిన విషాదం.. గుంటూరు దంపతులు మృతి

By

Published : Dec 27, 2022, 5:14 PM IST

Updated : Dec 28, 2022, 9:08 AM IST

Guntur couple died in snow storm
Guntur couple died in snow storm

17:11 December 27

బాధితులది గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు

GUNTUR COUPLE MISSING IN SNOW STROM : మంచు తుపాన్​ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమవుతోంది. అతిశీతల గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంచు తుపాను కారణంగా ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అతిశీతల గాలుల వల్ల, మంచు తుపాను కారణంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇదే మంచు తుపానులో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్​కు చెందిన దంపతులు మృతి చెందారు. అరిజోనాలో మంచు తుపానులో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులతో పాటుగా మరొకరు గల్లంతు కాగా.. వీరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

నిన్న హరిత మృతదేహం లభ్యం కాగా.. నేడు నారాయణ మృతి చెందినట్లు అధికారు గుర్తించారు. హరిత మృతదేహం నిన్న వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది.. ఇవాళ నారాయణ మృతదేహం వెలికితీశారు. అయితే ఈ ఏడాది జూన్‌లో నారాయణ, హరిత దంపతులు స్వగ్రామమైన పాలపర్రు వచ్చి వెళ్లారు. నారాయణ, హరిత మృతితో రెండు గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. ముద్దన నారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదే మంచు తుపాన్​ ప్రమాదంలో మరో తెలుగు వాసి మేడిశెట్టి గోకుల్‌ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 28, 2022, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details