ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు

By

Published : Nov 29, 2020, 7:41 AM IST

గంజాయి అక్రమంగా విక్రయిస్తూ.. సేవిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు పదార్ధాలకు అలవాటుపడి యువత భవిష్యత్​ను నాశనం చేసుకోవద్దని సీఐ తెలిపారు.

Five gang members arrested for selling marijuana
గుంజాయి విక్రయిస్తున్న ఐదుగురు ముఠా అరెస్టు

చెడు వ్యసనాలకు బానిసలై... గుంటూరు డీ.ఆర్.ఎం కార్యాలయం వద్ద గంజాయి సేవిస్తూ, పలువురుకి విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 కేజీల గంజాయి, 12 గంజాయి లిక్విడ్ బాటిల్స్, హుక్కా మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పూర్ణచంద్రరావు తెలిపారు. నిందితుల అయూబ్ సాహెబ్, అమీర్, నాగిరెడ్డి సాయి భాస్కర్ రెడ్డి, కటారి వంశీ కృష్ణ, పఠాన్ జమీర్ ముఠాగా ఏర్పాడి నగరానికి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయి మత్తుకి అలవాటుపడి యువత బంగారు భవిష్యత్​ను పాడు చేసుకోవద్దని సీఐ సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details