ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SOFTWARE EMPLOYEE: సాగుబాట పట్టిన సాప్ట్​వేర్ ఉద్యోగి

By

Published : Dec 28, 2021, 3:36 PM IST

SOFTWARE EMPLOYEE: సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాగుబాట పట్టాడు. ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకుని పొలంలోకి దిగాడు. అంతా కష్టమని భావించినచోటే ఇష్టంగా పంట పండిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్‌ తరహాలోనే సాగుబడిలోనూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ మంచిలాభాలు అర్జిస్తున్నాడు.

సాగుబాటు పట్టిన సాప్ట్​వేర్ ఉద్యోగి
సాగుబాటు పట్టిన సాప్ట్​వేర్ ఉద్యోగి

సాగుబాటు పట్టిన సాప్ట్​వేర్ ఉద్యోగి
SOFTWARE EMPLOYEE: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలేనికి చెందిన కోటిరెడ్డి 2014లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. నాలుగేళ్లు అదే వృత్తిలో కొనసాగారు. ఏదో తెలియని వెలితి ఆయనకు సంతృప్తినివ్వలేదు.

ఉద్యోగం చేస్తూనే సుభాష్ పాలేకర్ వీడియోలు చూసి ప్రకృతి సాగుపట్ల ఆకర్షితుడయ్యాడు. ఇక అంతే లక్షలు జీతం వచ్చే సాఫ్ట్‌వేర్‌ కొలువుకు టాటా చెప్పేసి పొలంలో వాలిపోయాడు. తమకున్న నాలుగున్నర ఎకరాలకు తోడు మరో ఎకరన్నర భూమిని కౌలుకు తీసుకున్నాడు. పలు రకాల పండ్లసాగుతో వ్యవసాయం మొదలుపెట్టాడు.

తొలి ఏడాది.. అరటి, బొప్పాయి, జామ, సీతాఫలం పంటలు సాగు చేశాడు కోటిరెడ్డి. గతేడాది చామంతి, మొక్కజొన్న, సన్ ఫ్లవర్ తోటలు వేసి అధిక లాభాలు పొందాడు. సాగుబడిలో ఎప్పటికప్పుడు మెళకువలు నేర్చుకుంటున్న కోటిరెడ్డి.. ఈ ఏడాది పండ్ల తోటల్లో అంతర పంటల విధానాన్నిఅనుసరిస్తున్నాడు. పలుచోట్ల జరిగే వ్యవసాయ తరగతులకు హాజరవుతూ,... సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నాడు.

పూర్తిగాసేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం కోసం ఆవులూ పెంచుతున్నాను. గుజరాత్‌కు చెందిన 9 గిర్ ఆవులు, రాజస్థాన్ కు చెందిన కాంక్రేజ్ ఆవును... పెంచుతూ వాటిపై వచ్చే పాలను సమీపంలోని నరసరావుపేటకు ఎగుమతి చేస్తున్నాను. ఆవుల మలమూత్రాలను జీవామృతంగా మార్చి పంటలకు వినియోగిస్తున్నాను. - కోటిరెడ్డి

ఇదీ చదవండి:Cinema Tickets Issue: సినిమా టికెట్ల వ్యవహారంపై కొత్త కమిటీ నియామకం

ABOUT THE AUTHOR

...view details