ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎస్​ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు: రామకృష్ణ

By

Published : Apr 3, 2021, 4:36 PM IST

ఎస్​ఈసీ స్వతంత్రంగా వ్యవహరించకుండా.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో జడ్పీటీసీగా పోటీ చేస్తున్న కుమారిని గెలిపించాలని ఆయన ప్రచారం నిర్వహించారు.

ఎస్​ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు: రామకృష్ణ
ఎస్​ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు: రామకృష్ణ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్న రోజే అన్ని పార్టీల నాయకులు ఆమెను కలిసినట్లు సీపీఐ రామకృష్ణ చెప్పారు. మూడో తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని.. రెండో తేదీ రాత్రి ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఎన్నికలకు ప్రచారం నిర్వహించుకునేందుకు నాలుగు రోజులు మాత్రమే వ్యవధి ఇవ్వడం సరైనది కాదని అన్నారు. సీఎం జగన్​కు అన్నిచోట్ల ఆయనే గెలవాలనే పిచ్చి పట్టిందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details