ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cpi: తెదేపా కేంద్ర కార్యాలయానికి సీపీఐ నేతలు..

By

Published : Oct 20, 2021, 2:33 PM IST

తెలుగుదేశం పార్టీ (TDP headquarters) కేంద్ర కార్యాలయాన్ని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI state secretary Ramakrishna) సందర్శించారు. పలువురు నేతలతో కలిసి వెళ్లిన ఆయన.. తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన తీరును పరిశీలించారు.

cpi
cpi

తెదేపా కేంద్ర కార్యాలయాన్ని(TDP headquarters) సీపీఐ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా.. పార్టీ ఆఫీసుపై దాడి జరిగిన తీరును నారా లోకేశ్(nara lokesh) సీపీఐ నేత రామకృష్ణకు వివరించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని నేతలు పరిశీలించారు.

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనను పరిశీలించిన సీపీఐ నేతలు

ఈ సందర్భంగా.. సీపీఐ నేత రామకృష్ణ(CPI state secretary Ramakrishna) మాట్లాడుతూ.. తెదేపా కార్యాలయంపై ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అన్నారు. పోలీసులు చట్టాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి

Security: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. అదనపు బలగాల పహారా

ABOUT THE AUTHOR

...view details