ఆంధ్రప్రదేశ్

andhra pradesh

chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌.. గవర్నర్ బిశ్వభూషణ్,​ సీఎం జగన్ ట్వీట్

By

Published : Jan 18, 2022, 8:16 AM IST

Updated : Jan 18, 2022, 6:59 PM IST

చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌
చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

18:11 January 18

కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: గవర్నర్‌ బిశ్వభూషణ్

కరోనా భారీ నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​ ఆంక్షాకించారు. వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబుకు​ సూచన చేశారు.

12:01 January 18

చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

తెదేపా అధినేత చంద్రబాబు కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన చంద్రబాబు.. కరోనా నిర్ధరణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.

అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో హోంఐసోలేషన్‌లో ఉన్న బాబు.. ఇటీవల కాలంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు ఆయన కుమారుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు సోమవారం కొవిడ్‌ నిర్ధరణ అయిన విషయం తెలిసిందే.

08:14 January 18

సీఎం జగన్ ట్వీట్

చంద్రబాబుకు కరోనా సోకటంపై సీఎం జగన్ స్పందించారు. వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి

PRC ORDERS: ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ షాక్‌.. డిమాండ్లు బేఖాతరు!

Last Updated :Jan 18, 2022, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details