ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇవాళ గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

By

Published : Oct 26, 2020, 10:49 PM IST

Updated : Oct 27, 2020, 12:03 AM IST

గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించనుంది. దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు మండలాల్లో పంట నష్టం పరిశీలించనుంది..

crop loss
crop loss

గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించనుంది. ఇటీవల కృష్ణా నదికి వరదలు రావటంతో తీరం వెంట ఉన్న ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. కొన్నిచోట్ల లంక గ్రామాల్లోకి కూడా వరదనీరు చేరింది. దాదాపు రెండు వారాలుగా వరదల కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజికి వరద తగ్గటంతో పంటపొలాల్లో నీరు క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో పంట నష్టం అంచనాకు అవకాశం ఏర్పడింది.

ఏ మేరకు నష్టం జరిగిందనేది అంచనా వేసేందుకు కేంద్ర బృందం జిల్లాకు రానుంది. దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు మండలాల్లో పర్యటించనుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం పరిహారంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Last Updated : Oct 27, 2020, 12:03 AM IST

ABOUT THE AUTHOR

...view details