ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సున్నిత కేసుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి'

By

Published : Aug 22, 2021, 3:23 PM IST

అత్యాచారం, హత్య తదితర సున్నిత కేసుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి గుంటూరు అర్బన్ ఎస్పీ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఘటనలపై దుష్ప్రచారం తగదని హెచ్చరించారు.

పోలీసు
పోలీసు

సున్నిత కేసుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్నారు. గుంటూరులో బాలికను వేధించిన కానిస్టేబుల్ ఘటనపై సామాజికమాధ్యమాల్లో దుష్ప్రచారం తగదని హెచ్చరించారు. ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని వెల్లడించారు. అంతేకాకుండా అతనిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అయితే ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల నుంచి ఇంతవరకు ఫిర్యాదు అందలేదని వెల్లడించారు.

రమ్య హంతకుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి, దిశ చట్టం ప్రకారం వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ వేశామని తెలిపారు.

విద్యాసంస్థల ప్రారంభం దృష్ట్యా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థల సమీప ప్రాంతాల్లో పోలీసులు ఉంటారని అన్నారు. పోలీసులు లేకుంటే సమాచారం అందిస్తే వెంటనే పంపుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:Constable suspended: బాలిక పట్ల కానిస్టేబుల్​ అసభ్య ప్రవర్తన..సస్పెన్షన్​

ABOUT THE AUTHOR

...view details