ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బావిలో పడి ఒకరు.. కాపాడబోయి ఇద్దరు మృతి.. ఆస్తి ఇవ్వలేదని ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

By

Published : Jun 1, 2023, 4:45 PM IST

Several crimes across the state: పిల్లనిచ్చిన మామ ఆస్తి పంచి ఇవ్వలేదని ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.. అలానే పల్నాడు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు దిగుడు బావిలోకి దిగి మృతి చెందారు. అంతే కాకుండా తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

Several crimes across the state
బావిలో పడి ఒకే కుంటుంబంలోని ముగ్గురు మృతి.. ఆస్తి ఇవ్వలేదని ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

Several crimes across the state: ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గంగంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లనిచ్చిన మామ ఆస్తి పంచి ఇవ్వలేదని ఆర్మీ ఉద్యోగి సుధాకర్ రెడ్డి (38) అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంటల్లో కాలిపోయిన సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఢిల్లీలో పని చేస్తున్న సుధాకర్ రెడ్డి సెలవుపై ఇటీవల ఇంటికి వచ్చాడు. మామకు సుధాకర్​కు ఆస్తి విషయంలో వాగ్వాదం జరగగా.. మనస్థాపంతో బుధవారం అర్ధరాత్రి సుధాకర్​ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సుధాకర్ రెడ్డి మృతిపై అతని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

యువకుడ్ని దారుణంగా హత్య చేసిన దుండగులు.. యువకుడ్ని దారుణంగా హత్య.. పాత కక్షలు నేపథ్యంలో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. పాండురంగ పేటకు చెందిన మట్టే ప్రశాంత్.. రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి వెంటపడి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ప్రశాంత్​పై గతంలో పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ ఉన్నందున పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ హత్యకేసులో తమ కుమారుడి పేరు ఉన్నందున తమకు పలుమార్లు బెదిరింపులు వచ్చాయని ప్రశాంత్ తల్లి తెలిపారు. హత్యచేసిన వారిని శిక్షించాలని ఆమె కోరారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో రేణిగుంట- నాయుడుపేట ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లికి చెందిన వెంకటమ్మ(65) ఆమె ముగ్గురు కుమారులు అశోక్ (45), దినేష్ (42), రాంబాబు(40)తోపాటు మనవరాళ్లు శాన్వితాక్షరి(06), బాన్వితాక్షరి(10)లు.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నిద్రమత్తులో ఆర్టీసీ బస్సును కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెంకటమ్మ, అశోక్, శాన్వితాక్షరి అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏర్పేడు సీఐ శ్రీహరి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బావిలో పడి ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి.. పల్నాడు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.. ముగ్గురు పశువుల కాపర్లు ప్రమాదవశాత్తు దిగుడుబావిలోకి దిగి మృతి చెందారు. మేకలను కడిగే సమయంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు జారీ బావిలో పడిపోగా.. కాపాడేందుకు తండ్రి కూడా బావిలోకి దూకాడు.. అది చూసిన బాలుడు బాబాయ్ ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేయగా అతను కూడా బావిలో పడి మృతి చెందాడు.. బావి లోతు ఎక్కువగా ఉండటం వల్ల ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. అది గమనించిన స్థానికులు ఒక వ్యక్తిని బయటకు లాగగా అప్పటికే నాగార్జున మృతి చెందాడు.

ఆటోను ఢీకోట్టిన బొలెరో..ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొనడంతో.. పదిమంది గాయాల పాలైన ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటుచేసుకుంది. హిందూపురం మండలం నందమూరినగర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా.. ఎనిమిది మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివిధ పనుల నిమిత్తం హిందూపురం పట్టణం వచ్చి తిరిగి నందమూరినగర్ మలుగూరు వైపు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పిడుగుపడి.. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బోలగోటలో విషాదం చోటు చేసుకుంది. బోలగోట ఆలయం వద్ద పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. వారిని ఆలూరు ఆస్పత్రికి తరలించారు. బోలగోట గ్రామంలో వివాహానికి రాగా ఈ ఘటన జరిగింది. వారంతా కర్ణాటక ఉత్తనూరు వాసులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details