ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దిక్కరణ కేసులో.. నిలబడే ఉండాలన్న హైకోర్టు తీర్పుపై ఉన్నతాధికారులకు ఊరట

By

Published : Jan 18, 2023, 12:04 PM IST

Updated : Jan 18, 2023, 4:17 PM IST

High Court
High Court

12:01 January 18

కోర్టు తీర్పు అమలు చేయలేదని జైలుశిక్ష విధించిన హైకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విధించిన శిక్షలో ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్ అధికారులకు ఊరట లభించింది. గతంలో ఓ కేసులో వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని.. ఐఏఎస్ బుడితి రాజశేఖర్‌, ఐఆర్ఎస్ రామకృష్ణకు హైకోర్టు నెలరోజుల జైలుశిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమాన విధించింది. అనంతరం వారిరువురిని అదుపులోకీ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆగ్రహంపై వారిరువురు క్షమాపణ కోరడంతో.. కోర్టు వారికి విధించిన శిక్షను సవరించింది. ఐఏఎస్ బుడితి రాజశేఖర్‌, ఐఆర్ఎస్ రామకృష్ణలు సాయంత్రం వరకు కోర్టు ఆవరణలో నిలబడే ఉండాలని ఆదేశించింది.

సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసిన అధికారులు.. ఐఏఎస్‌,ఐఆర్‌ఎస్‌ అధికారులకు విధించిన శిక్షపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రాజశేఖర్‌, రామకృష్ణకు హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సస్పెండ్ చేస్తూ, డివిజన్ బెంచ్‌. ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 18, 2023, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details