ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీవో 45పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసిన రైతులు

By

Published : Apr 3, 2023, 7:38 PM IST

lunch motion petition in High Court: ప్రభుత్వం ఇళ్లు లేని వారికి అమరావతిలో ఇంటి పట్టాలు ఇస్తానని వెల్లడించడించింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు హైకోర్టులో జీవో 45ను సవాల్ చేస్తూ లచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. అమరావతి ప్రాంతంలో 1134.58 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు కేటాయించిందని న్యాయవాది వాదనలు వినిపించారు.

lunch motion petition
లంచ్ మోషన్ పిటీషన్

lunch motion petition in High Court: రాజధాని ప్రాంతంలో ఆర్5 జోన్​లో భాగంగా సీఆర్డీఏ జీవో నెంబర్ 45ను జారీ చేసింది. జీవో 45ను సవాల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అమరావతి ప్రాంతంలో 1134.58 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు కేటాయించిందని న్యాయవాది వాదనలు వినిపించారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో స్థలం కేటాయించిందని తెలిపారు.

ఇళ్ల పట్టాల పంపిణీపై సీఆర్డీఏ అధికారులు సమావేశం కూడా ఏర్పాటు చేశారన్నారు. గతంలో సీఆర్డీఏ జీవో జారీ చేసిందని.. దానిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేసిందని పిటీషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రధాన పిటీషన్ పెండింగ్ లో ఉండగా జీవో జారీ చేయటం నిబంధనలకు విరుద్ధమన్నారు. మెయిన్ పిటీషన్ పిటీషన్ ఎక్కడ ఉందని న్యాయస్థానం ప్రశ్నించింది. త్రిసభ్య ధర్మాసనం ముందు ఉందని న్యాయవాది తెలిపారు. ఈ వ్యాజ్యాలను కూడా వాటికే జతచేసేందుకు సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి ఇళ్లు లేని వారికి అమరావతి ఇంటి పట్టాలు ఇస్తానని వెల్లడించడంతో రాజధాని ప్రాంత రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన 33వ C.R.D.A. అథారిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో "పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయింజడం కోసం సీఎం ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

అమరావతిలో "పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం ​ జీవో జారీ చేసింది. అమరావతిలో 11వందల34.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తంగా 20 లే అవుట్లలోని స్థలాలను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఈ రెండు జిల్లాలకు సుమారు 48 వేల 218 మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలనీ నిర్ణయించారు. ఐనవోలు, "పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు మందడం, కృష్ణాయపాలెం, కూరగల్లు, నిడమానూరు, నవులూరు ప్రాంతాల్లో .. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్​లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని ఆదేశించారు. సీఎం జగన్​ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద ఇళ్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనిఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details