ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PROTEST: దళిత గిరిజనుల భూములు కాపాడాలంటూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Jul 12, 2021, 7:52 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సోసైటీకి ఎన్నికలు నిర్వహించి దళిత గిరిజనుల భూములు కాపాడాలని ఉప తహసీల్దార్ రవికుమార్​కు వినతి పత్రం అందజేశారు.

దళిత గిరిజనల భూములు కాపాడాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
దళిత గిరిజనల భూములు కాపాడాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా

చిలకలూరిపేట మండలం యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీకి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని బాధిత రైతులతో కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. 1975లో అప్పటి ప్రభుత్వం యడవల్లి గ్రామానికి చెందిన 120 మంది దళిత గిరిజన రైతులకు ఏకపట్టా కింద యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ లిమిటెడ్ పేరుతో 416 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు ఇచ్చారు.

అప్పటి నుంచి రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. వాటిలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని ఏపీఎమ్ఐడీసీ ఇటీవల ఆ భూములు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో పరిశీలన జరిపి కేవలం 80 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారని మిగితా భూముల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా సొసైటీ కి సంబంధించి సభ్యుల గుర్తింపు కోసం గ్రామ సభలు నిర్వహించారు.

అందులో 20 మంది మాత్రమే సొసైటీలో సభ్యులుగా ఉన్నట్లు విచారణ అనంతరం అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దళిత గిరిజన, భూములను ప్రభుత్వం లాక్కోకుండా కాపాడేందుకు సదరు రైతులకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అండగా ఉండి పోరాటం చేయాలని రెండు రోజుల క్రితం రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులతో కలిసి చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

యడవల్లి వీకర్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని, దళిత, గిరిజన పేద రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సాగు చేసుకునే భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉప తహసీల్దార్ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

ఇరుపక్షాల వాదనలు విన్నాకే ఎంపీ రఘురామ అనర్హతపై నిర్ణయం: స్పీకర్ ఓంబిర్లా

ABOUT THE AUTHOR

...view details