ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంగళవారం తెలంగాణ కాంగ్రెస్‌ అసంతృప్తి నేతల ప్రత్యేక సమావేశం

By

Published : Dec 19, 2022, 10:17 PM IST

Congress Leaders Special Meeting: తెలంగాణ కాంగ్రెస్‌ అసంతృప్తి నేతలు ప్రత్యేక సమావేశానికి సిద్ధమవుతున్నారు. సేవ్‌ కాంగ్రెస్‌ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన అసంతృప్తుల వర్గం.. మంగళవార సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. మంగళవారం జరిగే సమావేశంలో కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.

congress
కాంగ్రెస్‌

Congress Leaders Special Meeting: తెలంగాణ కాంగ్రెస్‌ అసంతృప్తి నేతలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర రెడ్డి నివాసంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా.. పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా సమావేశం సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

సేవ్‌ కాంగ్రెస్‌ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన అసంతృప్తుల వర్గం.. మంగళవారం నాటి సమావేశంలో కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అధిష్ఠానం పిలిచి మాట్లాడితే.. నివేదించేందుకు వీలుగా ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పీసీసీ కమిటీల్లోని 172 మందిలో ఎంత మంది అర్హులు.. ఎందరు అనర్హులు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

ఉదయపూర్‌ డిక్లరేషన్‌ ప్రకారం అయితే.. కనీసం ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పని చేసి ఉండాలని.. కానీ ఇటీవల పార్టీలో చేరిన వారికీ పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగే సమావేశంలో నాయకులు ఎవరెవరు పాల్గొంటారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details