ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'క్షేత్రపర్యటన చేయడానికి వైసీపీ ప్రభుత్వం భయపడుతోంది - రైతులకు పరిహారం అందించాలి'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 5:28 PM IST

CPM Secretary Srinivasrao Comments on YCP Government: మిచౌంగ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి. శ్రీనివాసరావు, కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

CPM_Secretary_Srinivasrao_Comments_on_YCP_Government
CPM_Secretary_Srinivasrao_Comments_on_YCP_Government

CPM Secretary Srinivasrao Comments on YCP Government: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వైసీపీ నేతలు భయపడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఎనిమిది జిల్లాల్లో మిగ్‌జాం తుపానుతో అవస్థలు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు, రైతులను ఆదుకుంటామని చెప్పిన సీఎం జగన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొవడానికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు పట్టాలు పంపిణీ చేయలేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'క్షేత్రపర్యటన చేయడానికి వైసీపీ ప్రభుత్వం భయపడుతోంది - రైతులకు పరిహారం అందించాలి'

"జగన్ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండడం లేదు. క్యాంప్ కార్యలయం నుంచి ఆదేశాలు జారీ చేయడమే కాని అమలుకు నోచుకోవడం లేదు". -వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

రైతన్నను నిలువునా ముంచిన మిగ్‌జాం తుపాను - పంట నష్టం అంచనాలో సర్కారు తాత్సారం

Jagananna Colonies were Flooded:జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయని మండిపడ్డారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలకు మంచినీరు,ఆహారం అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉందని అందువల్లే లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అవ్వాయన్నారు. వరి పంట నష్టపోయిన రైతులకు రూ.25వేలు, ఉద్యాన పంటకు రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రా(RBK)లు వైఫల్యం చెందాయన్నారు.

రైతన్న ఇంట కన్నీరును మిగిల్చిన తుపాను - లక్షలాది ఎకరాలు వర్షార్పణం

CPI Secretary visited Eluru Cyclone Affected Areas: ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని స్థితిలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. తుపాను ముప్పును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో పలు గ్రామీణ మండలాలైన చాటపర్రు, తిమ్మారావుగూడెంలో రాష్ట్ర నాయకులతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మిగ్​జాం తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.40 వేలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

"తుపాను ప్రభావంతో పంట పెట్టుబడి, ఆదాయం కోల్పోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సూచనలు ఇస్తున్నారు కాని క్షేతపర్యటన చేయడం లేదు. పంట నష్టపరిహారానికి తగిన సహాయం అందించాలి." - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

Government Provide Compensation to Support Farmers: ఏలూరు జిల్లాలో మిగ్​జాం తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, నీట మునిగిన వరి పనలు, ధాన్యం రాశులను రామకృష్ణ పరిశీలించారు. అనంతరం బాధిత రైతాంగాన్ని పరామర్శించి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో విపత్తు సంభవించి రైతులను భారీ నష్టాన్ని కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు. రైతులకు అందాల్సిన పంట నష్టపరిహారం గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి విజయవాడలో రేపు మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తుపాను నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో సీఎం జగన్​ విఫలం : టీడీపీ నేతలు

ABOUT THE AUTHOR

...view details