ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu on Polavaram: కూల్చేవారికి కట్టడం ఎలా తెలుస్తుంది?: చంద్రబాబు

By

Published : Apr 15, 2023, 4:29 PM IST

Chandrababu on Polavaram project: పోలవరం పురోగతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎంను ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి నివేదిక ప్రకారం ఏడాదిలో 0.83శాతం పనులు మాత్రమే జరగడంపై చంద్రబాబు ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏడాదిలో 0.83శాతం పనులు మాత్రమే జరిగాయన్న కేంద్ర జలశక్తి శాఖ నివేదికపై సీఎం జగన్ సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. కూల్చేవారికి కట్టడం ఎలా తెలుస్తుందని విమర్శించారు.

Chandrababu on Polavaram
పోలవరం పురోగతిపై చంద్రబాబు

Chandrababu Naidu on Polavaram project: పోలవరం ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఏడాది మెుత్తంలో కేవలం 0.83 శాతం మేరకు పనులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ మేరకు తాజాగా కేంద్రం నివేదికలు విడదల చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే వైసీపీ విధానాలపై పలువురి నుంచి విమర్ళలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలవరం పనుల పురోగతిపై కేంద్రం విడుదల చేసిన అంశాలను ట్వీటర్​లో ప్రస్తావించారు. వార్తల్లో వచ్చి అంశాలను ఉదహరిస్తూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు: పోలవరం పురోగతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎంను ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి నివేదిక ప్రకారం ఏడాదిలో 0.83శాతం పనులు మాత్రమే జరగడంపై చంద్రబాబు ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏడాదిలో 0.83శాతం పనులు మాత్రమే జరిగాయన్న కేంద్ర జలశక్తి శాఖ నివేదిక పై సీఎం జగన్ సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. కూల్చేవారికి కట్టడం ఎలా తెలుస్తుందని విమర్శించారు. విధ్వంసకారులకు విధానం ఏముంటుందన్న చంద్రబాబు.., ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ప్రజలు సరిపెట్టుకోవాలా అంటూ మండిపడ్డారు.

కేంద్ర జలశక్తి శాఖ నివేదికలోని అంశాలు:: పోలవరం పనుల పురోగతిపై కేంద్ర జల్‌శక్తి శాఖ వార్షిక నివేదిక వెల్లడిస్తోంది. 2022-23 వార్షిక నివేదిక ప్రకారం.. ఏడాదిలో 0.83 శాతం మాత్రమే పనులు జరిగినట్లు తాజాగా వివరాలను వెల్లడించింది. గతేడాది నవంబరు నాటికి మొత్తం ప్రాజెక్టు పనులు 78.64శాతం మేర జరినట్లు పేర్కొగా... అంతకు ముందు ఏడాది నవంబరు నాటికి పూర్తయిన 77.81శాతం పనులతో పోలిస్తే.. ఈ 12నెలల్లో పనుల్లో పురోగతి కేవలం 0.83శాతం మాత్రమే ఉనట్లు కేంద్రం తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు అంచనా వ్యయం మీద ఇప్పటికీ స్పష్టత రాలేదు. 2019 ఫిబ్రవరి 11న సలహా కమిటీ సమావేశంలో.. 55 వేల 548 కోట్ల 87 లక్షల రూపాయలకు సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జల్‌శక్తిశాఖ అప్పట్లో ఆమోదించింది. అప్పట్లో ఇదే అంశంపై జల్‌శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రివైజ్డ్‌కాస్ట్‌ కమిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరుగుదలను పరిశీలనకు ఏర్పాటైంది. రివైజ్డ్‌కాస్ట్‌ కమిటీని 2019 ఏప్రిల్‌ 2న ఏర్పాటు చేశారు. 2020 మార్చి 17న ఆ కమిటీ జల్‌శక్తి శాఖకు ఈ కమిటీ నివేదిక సమర్పించింది. అనంతరం రివైజ్డ్‌కాస్ట్‌ కమిటీ 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని 47వేల 725 కోట్ల 74లక్షల రూపాయలకు సిఫార్సు చేసింది. సలహా కమిటీ ఆమోదించిన రెండో సవరించిన అంచనాతో పోలిస్తే ఈ కమిటీ సిఫార్సు చేసిన మొత్తం 7వేల 823 కోట్ల 13లక్షల రూపాయలు తక్కువ. దీన్ని ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ అంశం అనిశ్చితిగానే మిగిలినట్లు తాజా వార్షిక నివేదిక వెల్లడిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details