ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SEARCH FOR GOLD: బంగారం కోసం సముద్రతీరంలో వేట.. ఎక్కడంటే..

By

Published : Nov 18, 2021, 9:48 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అనేక మంది బంగారం కోసం వేట కొనసాగిస్తున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో సైతం వారి పని వారు చేసుకుని పోతున్నారు.

SEARCH FOR GOLD
SEARCH FOR GOLD

బంగారం కోసం సముద్రతీరంలో వేట

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ తీరంలో నిత్యం వందల సంఖ్యలో బోట్లు చేపల వేట సాగిస్తుంటాయి. అయితే గత కొంత కాలంగా సముద్ర తీరంలో స్థానికులు పసిడి కోసం వేట కొనసాగిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఉప్పాడ తీరంలో అలలు ఎగిసి పడుతూ.. ఈదురు గాలులతో స్థానికులు వణికిపోతున్నారు. కానీ.. కొందరు మాత్రం వాతావరణ ప్రతికూలతలోనూ తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. సముద్రం ఒడ్డున బండ రాళ్లలో బంగారు రేణువుల కోసం వెతకడంలో మునిగి తేలుతున్నారు. ఇంటిల్లిపాదీ తీరానికి వచ్చి ఇసుకలో అన్వేషణ చేస్తున్నారు.

ఉప్పాడ తీరంలో కోతకు నిత్యం జనావాసాలు, ఆలయాలు సాగర గర్భంలో కలిసి పోతున్నాయి. సముద్రంలో కలిసిన బంగారం తమకు దొరుకుతుందనే ఆశతో గత కొంత కాలంగా స్థానికులు పసిడి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా సముద్రం ఒడ్డునే కాలం వెల్లదీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details