ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సుడిగాలి బీభత్సం.. నేలమట్టమైన పాకలు

By

Published : Aug 5, 2020, 9:37 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం గొల్లపాలెంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. పశువుల పాకలు ధ్వంసమయ్యాయి. కొబ్బరి చెట్లు నేలకొరిగాయి.

east godavari district
సుడిగాలి బీభత్సం.. నేలమట్టమై పాకలు

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం రాజుల ఏనుగుపల్లి గ్రామ శివారు గొల్లపాలెంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. పచ్చని వరిచేళ్ల మీదుగా నీటిని పోలిన సుడిగాలి ఏర్పడి గ్రామం మీదకు వచ్చిందని స్థానికులు తెలిపారు. సుడి గాలి విపరీతంగా రావడంతో మూడు పశువుల పాకలు, మూడు కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఒక వంట షెడ్డు పైకప్పు ఎగిరి కింద పడింది. ఈ సంఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

ఇదీ చదవండిరాజధానిగా అమరావతే ఉంటుంది: గొల్లపల్లి సూర్యారావు

ABOUT THE AUTHOR

...view details