ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కాటన్ విగ్రహానికి వేసిన ముసుగు తొలగించండి'

By

Published : Jul 8, 2020, 1:38 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహానికి వేసిన ముసుగు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. 4 నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా ముసుగు వేశారని.. ఎన్నికలు వాయిదా పడినా ముసుగు తీయలేదని చెప్పారు.

sir arthor cotton statue in p gannavaram east godavari district
సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహానికి ముసుగు

సర్ ఆర్ధర్ కాటన్​ను రాజకీయ నాయకుడిగా భావించి ఆయన విగ్రహానికి ముసుగు వేయడం దారుణమని తూర్పుగోదావరి జిల్లా పీ. గన్నవరం వాసులు అంటున్నారు. స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా గ్రామంలో ఉన్న కాటన్ విగ్రహానికి 4 నెలల క్రితం ముసుగు వేశారు.

రాజకీయ నాయకుడు కాకపోయినా ముసుగు వేయడమే విచిత్రం అనుకుంటే.. ఎన్నికలు వాయిదా పడినా ఇప్పటికీ ముసుగు తీయకపోడం అన్యాయమని స్థానికులు వాపోతున్నారు. ఇది తప్పిదమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ముసుగు తొలగించాలని అధికారులను కోరుతున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details