ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vadapalli Venkateswaraswamy Temple: వాడపల్లి వెంకన్నకు వైభవంగా తిరుప్పావడ సేవ

By

Published : Oct 29, 2021, 11:38 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా(East Godavari district)లోని వాడపల్లి(Vadapalli Venkateswaraswamy Temple) ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి తిరుప్పావడ సేవ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులిహోర, గారెలు, పువ్వులతో గీసిన వెంకటేశ్వర స్వామి చిత్రం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

Vadapalli Venkateswaraswamy Temple
Vadapalli Venkateswaraswamy Temple

పులిహోర, గారెలు, పువ్వులతో ఆకట్టుకున్న వెంకటేశ్వర స్వామి చిత్రం

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా(East Godavari district) ఆత్రేయపురం మండలం వాడపల్లి ఆలయ బ్రహ్మోత్సవాల్లో అద్భుత చిత్రం కనువిందు చేసింది. పులిహోర, గారెలు, పువ్వులతో గీసిన వెంకటేశ్వర స్వామి చిత్రం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. స్వామి వారి తిరుప్పావడ సేవ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. అనంతరం పులిహోరను స్వామి ఆకారంలో నేలపై వేసి.. చుట్టూ గారెలు, మిరపకాయలు, పండ్లు, పువ్వులతో అందంగా అలంకరించారు. ఈ విభిన్న కళాకృతిని భక్తులు ఆసక్తిగా తిలకించారు.

ABOUT THE AUTHOR

...view details