ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమం ఆగదు.. నది సాగదు..!

By

Published : Dec 2, 2020, 12:36 PM IST

లంక గ్రామమైన లంక ఆఫ్‌ ఠాణేలంకలో ఇళ్ల స్థలాలకు సేకరించిన పల్లపు భూమిని మెరకచేసే ముసుగులో ఇసుక దందా జోరుగా సాగుతోంది. గురజాపులంకలో గోదావరికి అడ్డుకట్ట వేసి ఇసుకను తరలిస్తున్నారు.

sand mafiya
నదికి అడ్డుకట్ట వేసి ఇసుక అక్రమ దందా

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంకలో గోదావరికి అడ్డుకట్ట వేసి ఇసుకను తరలిస్తున్నారు. లంక గ్రామమైన లంక ఆఫ్‌ ఠాణేలంకలో ఇళ్ల స్థలాలకు సేకరించిన పల్లపు భూమిని మెరకచేసే ముసుగులో ఈ దందా కొనసాగుతోంది. గురజాపులంక వద్ద మూడు పాయలు కలిసే చోట గోదావరికి అడ్డుకట్ట వేసి మరీ ఇసుకను పొక్లెయిన్‌తో తవ్వి తరలిస్తున్నారు.

ముమ్మిడివరం తహసీల్దారును వివరణ కోరగా.. లంక ఆఫ్‌ ఠాణేలంకలో ఇళ్ల స్థలాల మెరక చేయడానికి గతంలో అనుమతినివ్వగా.. కొంత వరకు పనిచేశారన్నారు. ప్రస్తుతం అక్కడ ఇసుక తరలింపునకు అనుమతులు లేవని చెప్పారు. మిగిలిన పని పూర్తిచేసే క్రమంలో ఇసుక తరలింపునకు ట్రాక్టర్ల నంబర్లు ఇవ్వాలని సూచించామని.. ఇంకా అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details