ఆంధ్రప్రదేశ్

andhra pradesh

STUDENT MISSING CASE: ఇంజనీరింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో నిందితుడి అరెస్ట్

By

Published : Dec 16, 2021, 10:52 PM IST

STUDENT MISSING CASE: తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన యువతి అదృశ్యం ఘటనలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ అధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు.

ENGINEERING STUDENT MISSING CASE
ENGINEERING STUDENT MISSING CASE

ENGINEERING STUDENT MISSING CASE: తూర్పు గోదావరి జిల్లాలో యువతి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. నిన్న(బుధవారం) రాజానగరం మండలానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. యువతిని అపహరించిన నిందితుడిని భీమవరంలో పట్టుకున్నారు.

ఎప్పటిలాగానే ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఇంటికి తిరిగి రాలేదు. యువతి తండ్రికి ఫోన్ చేసి నిందితుడు రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు రాజానగరం పోలీసులను ఆశ్రయించారు.

అసలేం జరిగిందంటే..
రాజానగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(19) బుధవారం అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న ఆ యువతి బుధవారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు బస్సులో బయలుదేరినా.. కళాశాలకు వెళ్లలేదు. మార్గం మధ్యలో రాజానగరంలో బస్సు దిగిందని పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఆమె ఓ యువకుడి ద్విచక్రవాహనం ఎక్కి వెళ్లినట్లు గమనించారు.

ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో.. గుర్తుతెలియని వ్యక్తి సదరు యువతి తండ్రికి ఫోన్‌ చేశాడు. మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాం.. రూ.5 లక్షలు ఇవ్వండి, లేకుంటే చంపేస్తాం.. అంటూ హెచ్చరించాడు. దీంతో.. సదరు విద్యార్థిని తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు బుధవారం రాత్రి కాకినాడ వెళ్లి విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే నిందితుడిని భీమవరంలో పట్టుకున్నారు. ఈ కేసుసు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఇదీ చదవండి:

Drunker Attack on Conistable : మద్యం మత్తులో కానిస్టేబుల్ పై వ్యక్తి దాడి.. ఆ తర్వాత..?

ABOUT THE AUTHOR

...view details