అత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో ఓ యువకుడు స్నానానికి దిగి గల్లంతయ్యాడు. రాజమహేంద్రవరానికి చెందిన ఐదుగురు యువకులు సరదాగా స్నానం చేసేందుకు బొబ్బర్లంక బ్యారేజీ సమీపంలోని పిచ్చుకలంక వద్దకు వచ్చారు. అక్కడ గోదావరిలో స్నానానికి దిగగా... ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల నామవరానికి చెందిన బాషా శేఖర్(20) గల్లంతయ్యాడు. మిగిలిన నలుగురు యువకులు సురక్షితంగా బయట పడ్డారు. గల్లంతైన యువకుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ఎస్సై సురేష్ తెలిపారు.
గోదావరిలో స్నానానికి దిగి యువకుడు గల్లంతు
రాజమహేంద్రవరానికి చెందిన ఐదుగురు... సరదాగా స్నానం చేసేందుకు పిచ్చుకలంక వద్దకు వచ్చారు. గోదావరిలో స్నానానికి దిగగా... ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఓ యువకుడు గల్లంతయ్యాడు. మిగతా వారు సురక్షితంగా చేరగా... గల్లంతైన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
గోదావరిలో యువకుడు గల్లంతు
TAGGED:
godavari river latest news