ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదాలు.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

By

Published : Dec 20, 2020, 10:33 PM IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులో ఆగి ఉన్న వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొని ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.

one person died in road acciden
రోడ్డు ప్రమాదాలు

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొత్త మురమళ్ల గ్రామానికి చెందిన లంక శ్రీనివాస్ పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పింది. లాకులు వంతెన వద్ద పడిపోయిన అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదంపై ఐ.పోలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా పర్చూరులో..

ఆగి ఉన్న మినీ వ్యానును ద్విచక్రవాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన మత్తయ్య దంపతులు ద్విచక్రవాహనంపై చీరాల నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. కారంచేడు-పర్చూరు మధ్య ఉన్న పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. మత్తయ్య కాలుకు తీగ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చీరాల ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:'దివిస్​పై 10 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details