ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హంసవాహనంపై భద్రకాళి సమేత విరేశ్వర స్వామివారు

By

Published : Mar 16, 2021, 3:42 PM IST

తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో కొలువైన భద్రకాళి సమేత విరేశ్వర స్వామివారిని మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా హంస వాహనంపై ఊరేగించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

హంస వాహనంపై ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లు
హంస వాహనంపై ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లు

మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో కొలువై ఉన్న భద్రకాళి సమేత విరేశ్వర స్వామి వారిని హంస వాహనంపై ఊరేగించారు. అంతకుముందు స్వామి అమ్మవార్లను నంది వాహనంపై పురవీధుల్లో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం గోదావరి మాతకు పసుపు, కుంకుమ, పట్టుచీరను ఆలయ కార్యనిర్వహణాధికారి, పాలక మండలి సభ్యలు సమర్పించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఇదీ చదవండి: 'ప్యాకేజీ పూర్తిగా చెల్లించకపోతే గ్రామాలు ఖాళీ చేయం'

ABOUT THE AUTHOR

...view details