ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దివ్యాంగులకు ఎమ్మెల్యే ట్రైసైకిళ్ల పంపిణీ

By

Published : Oct 3, 2020, 2:14 PM IST

ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు చేయూత ఇవ్వడానికి పూనుకున్నారు.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ ఉదయభాస్కర్​లు. వారికి నిత్యం అవసరమయ్యే సామగ్రిని అందజేశారు. ప్రభుత్వమూ వారి ఆరోగ్య విషయమై శ్రద్ధ వహిస్తోందని తెలిపారు.

Giving Tricycles
ట్రైసైకిళ్ల వితరణ

ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయభాస్కర్​లు.. దివ్యాంగ పిల్లలకు ట్రై సెకిళ్లు, కళ్లజోళ్లు తదితర పరికరాలను అందజేశారు. తూర్పు గోదావరి అడ్డతీగలలోని 'భవిత' కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలతో కొంత సేపు ముచ్చటించారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని రంపచోడవరం ఎమ్మెల్యే పేర్కొన్నారు. 'భవిత' కేంద్రాల్లో ప్రతి వారం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నెలనెలా వారికి పింఛను అందిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:విషాహారం తిని 11 మంది చిన్నారులకు అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details