ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దారుణం.. సొంత కూతురిపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రి

By

Published : Jul 27, 2021, 4:31 PM IST

Updated : Jul 27, 2021, 5:12 PM IST

ఆలన పాలన చూసుకోవాల్సిన తండ్రే అఘాయిత్యానికి పాల్పడతాడని ఆ బాలిక ఎలా ఊహిస్తుంది..? కామాంధుల వికృత చర్యల నుంచి రక్షించాల్సిన తండ్రే కన్న కూతురిని లైంగిక వేధింపులకు గురిచేస్తే చెప్పుకునే దిక్కెవరు..! నాన్నే ధైర్యం అంటూ చెప్పుకునే ఆ పాప ఇప్పుడు ఎందుకు భయపడుతోంది. కన్నతండ్రే వికృతంగా వేధిస్తున్నాడంటూ నానమ్మకు చెప్పుకోవడంతో ఆమె దిశా పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో బాలిక తండ్రిపై దిశా పోలీసులు కేసు నమోదు చేశారు.

father sexually assaulted daughter
లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రి

కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవలసిన ఓ తండ్రి సొంత కూతురితో అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చొప్పెల్ల గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలికను తండ్రి లైంగిక వేధింపులు గురిచేస్తున్నాడని బాలిక నానమ్మ పోలీస్ స్టేషన్​కు సమాచారం ఇచ్చింది.

బాలిక తల్లి జీవనోపాధి నిమిత్తం దుబాయ్​లో నివాసముంటుంది. నానమ్మ కూడా జీవనోపాధి నిమిత్తం 15 రోజుల కిందట హైదరాబాద్ వెళ్లింది. తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి చొప్పెల్లలో ఉంటున్నారన్నారు. ముగ్గురు పిల్లల్లో పెద్ద అమ్మాయిపై కొన్ని రోజుల నుంచి తండ్రి రాత్రి సమయంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని నాన్నమ్మకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఇంటికి చేరుకున్న ఆమె ఆలమూరు పోలీస్ స్టేషన్​లో కొడుకు చేస్తున్న నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు దిశా డీఎస్పీ మురళీమోహన్ తెలిపారు. సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న డీఎస్పీ చొప్పెల్లలోని ఇంటిని పరిశీలించారు.

Last Updated : Jul 27, 2021, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details