ETV Bharat / crime

MAN SUICIDE: ప్రియురాలి ఇంటి ఎదుట... వ్యక్తి బలవన్మరణం..!

author img

By

Published : Jul 27, 2021, 1:21 PM IST

ఆమెకు పెళ్లైంది. అతనికీ పెళ్లైంది. ఇద్దరికీ వేర్వేరుగా ముగ్గురు, ముగ్గురు పిల్లలూ ఉన్నారు. ఆమె కొన్నాళ్లుగా భర్తతో విడిగా ఉండటంతో... అతను ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె కూడా ఇంతకాలం అతనితో కలిసే ఉంది. కానీ ఆమె భర్త పిలవగానే.. అతడితో వెళ్లిపోయింది. అది తట్టుకోలేని ఆమె ప్రియుడు... పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

MAN SUICIDE
MAN SUICIDE

‘ఇద్దరం ప్రేమించుకున్నాం.. కొంతకాలం కలిసి ఉన్నాం, ఒక్కసారిగా ఇప్పుడు నన్ను కాదంటోంది..’ అంటూ ఓ వివాహితుడు... ప్రేమించిన గృహిణి ఇంటి ముందే నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్​కి చెందిన నాగోల్‌ వాసి సురేశ్‌ (35) హిమాయత్‌నగర్​లోని ఓ జిరాక్స్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అక్కడే మరో సంస్థలో యాదవ గల్లీకి చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆమె భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. ముగ్గురు పిల్లలున్నారు. సురేశ్‌కు సైతం.. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కొన్నాళ్ల క్రియం ఆ యువతితో సురేశ్ కు పరిచయం ఏర్పడింది. ఏడు నెలలు కలిసిమెలిసి తిరిగారు. ఇటీవల ఆ మహిళ మళ్లీ తన భర్త వద్దకు వెళ్లింది. ఆమె కోసం సురేశ్‌ భార్యతో గొడవ పడ్డాడు.

ప్రియురాలి కోసం... ఆత్మహత్యాయత్నం..

ప్రేమించిన మహిళకు మూడు నాలుగు రోజులుగా ఫోన్‌ చేస్తుంటే మాట్లాడటం లేదు. ప్రస్తుతం కుటుంబంతో నేను ఆనందంగా ఉన్నా.. మన సంబంధాన్ని ఇంతటితో ఆపేద్దామని ఆమె చెప్పడంపై.. సురేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. స్థానికులు నచ్చజెప్పి పంపించేశారు. ఆదివారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో పెట్రోల్‌ సీసాతో వెళ్లి మళ్లీ తలుపు తట్టాడు. ఆమె కోసం చచ్చిపోతానంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.

చికిత్స పొందుతూ మృతి..

సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షలో అతనికి కొవిడ్‌ పాజిటివ్‌ గా ఫలితం రావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని భార్యకు చెప్పగా, తొలుత రానని చెప్పినా.. పోలీసుల మాట గౌరవించి వచ్చి సేవలందించింది. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూయడంతో కన్నీరుమున్నీరైంది.

హద్దులు దాటిన ప్రేమ.. చివరికి ఓ కుటుంబానికి దిక్కు లేకుండా చేసింది. ముగ్గురు పిల్లలకు తండ్రిని దూరం చేసింది. మరో యువతికి జీవిత కాలపు ఆవేదన మిగిల్చింది. అప్పటికే పెళ్లై.. పిల్లలు సైతం ఉన్న సురేశ్.. తనలాగే పెళ్లై పిల్లలు ఉన్న మరో యువతితో పెట్టుకున్న అనవసర సంబంధమే.. ఇంతటి విషాదానికి కారణమైంది. అందుకే.. సంబంధాలు, బాంధవ్యాలు.. వ్యామోహంతో కాకుండా.. విలువలతో కూడి ఉంటే.. ఇప్పుడు సురేశ్ భార్య ఒంటరయ్యేది కాదు. అతని పిల్లలు తండ్రి లేని పిల్లలుగా మిగిలేవాళ్లూ కాదు. ఇలాంటి వాళ్లు.. క్షణికావేశాలకు లోనయ్యే ముందు.. తమ కుటుంబం పరిస్థితి ఆలోచించుకుంటే.. ఇంతటి విషాద ఘటనలకు ఆస్కారం ఉండదు.

ఇదీ చదవండి:

నవ వధువుకు షాక్.. తొలి రాత్రి భర్త వింత ప్రవర్తన.. ఇదేమని అడిగితే...!

Viral Video: యువకుడిని వెంటాడి తొక్కి చంపిన ఏనుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.