ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఖాళీ బిందెలు పట్టుకొని.. నడి రోడ్డు మీద కూర్చొని..!

By

Published : Mar 28, 2022, 2:45 PM IST

ఎండా కాలం ఇంకా పూర్తిగా వేడెక్కనే లేదు.. అప్పుడే తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది! తాళ్లరేవు మండలంలోని 18 గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. వారం రోజులుగా కుళాయి నీళ్లు కూడా రావడం లేదని.. ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై మహిళలు ఆందోళన చేపట్టారు.

drinking water problem in villages
తాళ్లరేవు పరిధిలోని 18 గ్రామాల్లో తాగునీటి సమస్య

తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని 18 గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి. మంచినీటి చెరువు సమీపంలో ఉన్న గ్రామంలోనూ.. వారంరోజులుగా కుళాయి నీరు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జాతీయ రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కారించాలని నినాదాలు చేశారు. స్పందించిన అధికారులు సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. దీంతో.. మహిళలు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: Polavaram Canal: పోలవరం కాలువ గట్టుపై రాకపోకలు.. లైనింగ్ ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details