ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధరలేని దివాన్‌చెరువు సీతాఫలం

By

Published : Oct 23, 2020, 5:23 PM IST

Updated : Oct 23, 2020, 9:45 PM IST

రుచికి అద్భుతం... ఔషధ గుణాల సమాహారం సీతాఫలం. నాటి పురాణాల నుంచి నేటి వైద్యుల వరకూ సీతాఫలం పోషకాల గురించి తెలిసినవారే. అలాంటి మధురఫలానికి తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు ప్రసిద్ది. ఈ ఏడాది మాత్రం వివిధ కారణాలతో కాపు సరిగా లేక అటు రైతులు, ఇటు వినియోగదారులను ఈ ఫలం నిరాశపరుస్తోంది.

diwancheruvu-pond-cherr
దివాన్‌చెరువు సీతాఫలం

తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు సీతాఫలం అంటే జిల్లా వాసులకు నోరూరుతుంది. ఇక్కడ సాగయ్యే సీతాఫలాలు విశాఖ, అమరావతి, విజయవాడతోపాటు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంటాయి. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఈ ఫలాలు ఎక్కువగా లభిస్తాయి. ఈ ఏడాది సీతాఫలాల మొదటి విడత కాపు సాధారణంగా ఉన్నా.. అనంతరం కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చు పెరిగిపోయింది. దిగుబడి తగ్గిపోయింది. నాసిరకంగా ఉన్న కాయకు మంచి ధర పలకడం లేదని వాపోతున్నారు రైతులు. పెట్టుబడి ఖర్చులైనా రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో అధిక దిగుబడితో సరకు అందుబాటులో ఉండేదని... సామాన్యులకు కూడా సీతాఫలం అందుబాటులో ఉండేదని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం దిగుబడి తగ్గిపోయి నాణ్యత లేకపోవడ వ్యాపారం దెబ్బతిందని చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వల్ల భవిష్యత్తులో దివాన్ చెరువు సీతాఫలం ఉంటుందా అనే సందేహాన్ని రైతులు, స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కుంటున్నారు: చినరాజప్ప

Last Updated : Oct 23, 2020, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details