ఆంధ్రప్రదేశ్

andhra pradesh

attack: వైకాపా నాయకుడి ఇంటిపై దాడి.. మూగజీవిపై ప్రతాపం

By

Published : Nov 5, 2021, 4:38 PM IST

Updated : Nov 5, 2021, 5:38 PM IST

తూర్పుగోదావరి జిల్లా(east godavari district) ప్రత్తిపాడులో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక వైకాపా నాయకుడి ఇంటిపై దళితులు దాడి(attack) చేశారు. దళితుల దాడిలో వైకాపా నాయకుడి కారు ధ్వంసం కాగా... అతని శునకానికి గాయాలయ్యాయి.

attack
attack

వైకాపా నాయకుడి ఇంటిపై దాడి.. మూగజీవిపై ప్రతాపం

తూర్పుగోదావరి జిల్లా(east godavari district) ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు మురళి ఇంటిపై దళితులు దాడి(attack) చేశారు. ఈ దాడిలో మురళి శునకానికి గాయాలు కాగా.. అతని కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై సైతం దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ అరిటాకులు శ్రీనివాస్.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేపట్టారు. గ్రామంలో ఆవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. గతంలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో గ్రామ దళితులపై మురళి కర్రలతో దాడి చేయడంతో...పాత కక్షల నేపథ్యంలో ఈ దాడికి యత్నించారని స్థానికలు తెలిపారు.

ఇదీ చదవండి:attack: టోల్ ప్లాజా సిబ్బందిపై వైకాపా నాయకుల దాడి

Last Updated :Nov 5, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details