ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శాంతించిన గోదారమ్మ... ముంపు నుంచి బయటపడిన కాజ్​వే

By

Published : Jul 28, 2021, 11:59 AM IST

గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెం సమీపంలోని కాజ్​వే గోదావరి వరద ముంపు నుంచి బయటపడింది. నాలుగు రోజుల అనంతరం కాజ్​వేకు అవతల వైపున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక గ్రామ ప్రజలు చాకలి పాలెం వైపు రావడానికి మార్గం సుగమం అయ్యింది.

causeway_mumpu_remove
ముంపు నుంచి బయటపడిన కాజ్వే

నాలుగు రోజుల క్రితం గోదావరి వరద ఉధృతికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం సమీపంలోని కాజ్​వే మునిగిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక గ్రామ ప్రజలు తూర్పుగోదావరి జిల్లా చాకలి పాలెం వైపు రావడానికి చాల ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో రెండు గ్రామల మద్య మళ్ళి రాకపోకలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం ఉన్న కాజ్​వే శిధిలావస్థకు చేరుకుందని కొత్త కాజ్​వేను ఎత్తుగా నిర్మించాలని లంక గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details