ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెరువులో స్నానానికి వెళ్లి బాలుడు మృతి

By

Published : Mar 20, 2021, 9:12 PM IST

చెరువులో స్నానానికి వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన కాకినాడ గ్రామీణం గైగోలుపాడులో జరిగింది. బాలుడి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చెరువులో స్నానానికి వెళ్లి బాలుడు మృతి
చెరువులో స్నానానికి వెళ్లి బాలుడు మృతి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం గైగోలుపాడులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లిన డేవిడ్(10)అనే బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇంటి వద్దే ఆడుకుంటున్నాడనుకున్న కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details