ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Badminton Player Suicide: 'భవిష్యత్​పై భయంగా ఉంది.. నావల్ల కాదు’

By

Published : Dec 28, 2021, 7:24 AM IST

Updated : Dec 28, 2021, 12:38 PM IST

badminton player suicide: ‘అక్కా.. నాకు వెళ్లాలని లేదు. కానీ.. మొన్నటి నుంచి ఆలోచనలో పడ్డా. మన ఫ్యూచర్‌ కోసం నాన్నమ్మ భయంతో ఉందని అర్థమైంది. ఓపక్క నాన్న ఇంట్లో ఏం పట్టించుకోరు. నాన్నమ్మకి, అమ్మకి ఆరోగ్యం బాలేదు. భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉందక్కా. నావల్ల కాదు. ఐయాం సారీ, కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. బై అక్కా...’ అంటూ ఆదివారం అర్ధరాత్రి దాటాక 2.53 గంటలకు వాట్సప్‌లో సందేశం పంపించి.. ఓ యువ క్రీడాకారిణి తన నిండు జీవితాన్ని చాలించింది.

ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మీ
ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మీ

badminton player suicide: యానాంలోని స్థానిక జీఎంసీ బాలయోగి కాలనీకి చెందిన దండుప్రోలు ధర్మారావు చిన్న కుమార్తె ఆదిలక్ష్మి బాల్‌బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. ఆటలో రాణిస్తూ 2019, 2020లలో ఎస్‌జీఎఫ్‌ఐ, సబ్‌ జూనియర్‌ నేషనల్స్‌ పోటీల్లో పాల్గొంది. చేపల వ్యాపారం చేసే తండ్రి ఖాళీగా ఉంటుండటంతో భవిష్యత్తుపై బెంగతో బలవన్మరణానికి పాల్పడింది.

సోమవారం తెల్లవారుజామున బ్యాడ్మింటన్‌ ఆడేందుకు బయల్దేరే ఆదిలక్ష్మి దేవుడి గదిలోకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె అక్క ధనకుమారి వెళ్లిచూడగా ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న ఆదిలక్ష్మి జనవరిలో జరగనున్న స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి;

AOB : ఏవోబీలో యుద్ధవాతావరణం.. మావోయిస్టు కదలికలతో పోలీసుల అప్రమత్తం

Last Updated : Dec 28, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details