ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Teacher takes alcohol: "సారు దగ్గర సారా వాసన.. ఆయన మాకొద్దు"

By

Published : Nov 22, 2021, 7:48 PM IST

a teacher is leaving to school by taking alcohol daily in vemulakonda

ఉపాధ్యాయుడు పాఠశాలకు మద్యం తాగి వస్తున్నాడని(teacher drinking alcohol) విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులతో కలిసి ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. ఆ మాష్టారు మాకొద్దంటే వద్దన్నారు.



మద్యం తాగి పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడు తమకు వద్దంటూ.. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం వేములకొండ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో జరిగింది.

వేములకొండ ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గంగరాజు.. పాఠశాలకు సరిగా రావడం లేదని, ఒకవేళ వచ్చినా మద్యం సేవించి(vemulakonda school teacher drinking alcohol) వస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు.

ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఆయన తీరు మార్చుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. అధికారులు స్పందించి ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

High court on three capitals cases: 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details