ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నాటు సారా తయారు చేయాలంటూ వాలంటీర్​ వేధింపులు'

By

Published : Oct 7, 2020, 11:03 PM IST

నాటు సారా తయారుచేయాలని గ్రామ వాలంటీర్​ వేధిస్తున్నాడని ఓ వ్యక్తి చిత్తూరు జిల్లా సబ్​కలెక్టర్​ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాటుసారా కాయకపోతే తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆవేదన చెందారు.

నాటుసారా తయారు చేయాలని వాలంటీర్​ వేధింపులు!
నాటుసారా తయారు చేయాలని వాలంటీర్​ వేధింపులు!

నాటుసారా తయారుచేయాలని గ్రామ వాలంటీర్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ వ్యక్తి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం నారమాకులపల్లె తండాకి చెందిన గ్రామ వాలంటీర్ రవీంద్ర నాయక్ తమను వేధిస్తున్నాడని.. మల్లేష్ నాయక్ అనే వ్యక్తి మదనపల్లి సబ్​కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

గ్రామ వాలంటీర్ తమతో సారా కాయించి, కొనుగోలు చేస్తున్నాడని ఫిర్యాదు చేసిన బాధితుడు... సారా తయారీకి నిరాకరించిన తమపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పాడు. వాలంటీర్​ తన బంధువులతో కలిసి సారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఏవో షంషేర్ ఖాన్​కి ఫిర్యాదు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details