ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తేదీలు ఖరారు

By

Published : Sep 26, 2021, 7:10 PM IST

తిరుమల

శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు వెల్లడించింది.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు వెల్లడించింది. కరోనా నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తితిదే తెలిపింది. ఈ మేరకు అక్టోబర్‌ 5న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహనసేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

ఏ రోజు.. ఏ సేవ..

  • 06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వ‌ర‌కు)
  • 07-10-2021: ధ్వజారోహణం (ఉదయం) - పెద్దశేష వాహనసేవ (సాయంత్రం)
  • 08-10-2021: చిన్నశేష వాహ‌నసేవ (ఉదయం) - హంస వాహనసేవ (సాయంత్రం)
  • 09-10-2021: సింహ వాహ‌న సేవ (ఉదయం)- ముత్యపుపందిరి వాహ‌న సేవ (సాయంత్రం)
  • 10-10-2021: క‌ల్పవృక్ష వాహ‌నసేవ (ఉదయం)- సర్వభూపాల వాహనసేవ (సాయంత్రం)
  • 11-10-2021: మోహినీ అవ‌తారం (ఉదయం)- గ‌రుడ‌ వాహనసేవ‌ (సాయంత్రం)
  • 12-10-2021: హ‌నుమంత వాహ‌నసేవ (ఉదయం)- గ‌జ వాహ‌నసేవ (సాయంత్రం)
  • 13-10-2021: సూర్యప్రభ వాహ‌నసేవ (ఉదయం)- చంద్రప్రభ వాహ‌నసేవ (సాయంత్రం)
  • 14-10-2021: రథోత్సవానికి బ‌దులుగా సర్వభూపాల వాహనసేవ (ఉదయం)- అశ్వ వాహ‌నసేవ (సాయంత్రం)
  • 15-10-2021: ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)

ఇదీ చదవండి:TIRUMALA: ఆన్​లైన్​లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు.. అరగంటలోపే ఖాళీ

ABOUT THE AUTHOR

...view details