ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుదాఘాతంతో ముగ్గురు.. రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు మృతి

By

Published : Mar 22, 2023, 10:55 PM IST

Several people died in various accidents: నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ మృతి చెందగా.. ఏలూరు జిల్లాలో ఆటోపై తాడిచెట్టు విరిగి పడిన ఘటనలో రెండేళ్ల పాప మృతి చెందింది. ఉగాది పండుగనాడువేప పూత కోసం వెళ్లి బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరగగా.. టేబుల్ ఫ్యాన్​కు విద్యుత్ సరఫరా అయి తల్లీకొడుకు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

various accidents
రోడ్డు ప్రమాదం

Several people died in various accidents : పండుగ పూట ఏలూరు, నెల్లూరు జిల్లాల్లోజరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల పాపతో పాటు.. లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. అదేవిధంగా రెండు వేర్వేరు ఘటనలో విద్యుదాఘాతంతో మరో ముగ్గురు మృతి చెందిన ఘటనచిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జరిగింది.

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కండ్రిగ సమీపంలో విద్యుదాఘాతంతో విక్రమ్ అనే (16) ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. ఉగాది పండుగ రోజు వేప పూత కోసం సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాడు. విక్రమ్ ఎంతసేపటికీ రాకపోవడంతో అతని తల్లి అరుణ.. అతని కోసం వెతకసాగింది. వేప వూవు కోసం వెళ్లిన విక్రమ్.. చెట్టుపై ఉన్న 11 కెవి విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండలం మల్లికేతి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. గంగమ్మ (70) అతని ఇద్దరు కుమారులు శివారెడ్డి, బసవరాజు (40)తో గ్రామ సమీపంలోని పొలంలో ఇంటిని నిర్మించుకున్నారు. ఇద్దరు కుమారులతో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నారు. శివారెడ్డి 3 రోజుల క్రితం పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. ఇంట్లో గంగమ్మ, బసవరాజు మాత్రమే ఉన్నారు. సోమవారం రాత్రి నిద్రించిన సమయంలో టేబుల్ ఫ్యాన్​కు విద్యుత్ సరఫరా అయినట్టు తెలుస్తోంది. ముందు గంగమ్మ విద్యుత్ షాకుకు గురైనట్లు.. ఆమెను రక్షించబోయిన బసవరాజ్ కూడా విద్యుత్ షాక్​తో మృతి చెంది ఉండవచ్చని గ్రామస్థులంటున్నారు. ఊరి బయట పొలంలో ఇల్లు ఉండడంతో ఎవ్వరూ కనుగొనలేకపోయారని పోలీసులు వెల్లడించారు. పశువులు అరుస్తున్న విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి ఈ విషయం పలువురికి చెప్పాడు.

నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్, క్లీనర్​లు ఘటన ప్రదేశంలోనే మృతి చెందారు. చెన్నై నుంచి పత్తి లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న లారీ, ముందున్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొట్టింది. లారీ ముందు భాగం కంటైనర్​లోకి చొచ్చుకుపోవడంతో డ్రైవర్, క్లీనర్ లారీలోనే ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. లారీలో ఇరుకుపోయిన డ్రైవర్, క్లీనర్ మృతదేహాలను కష్టంమీద బయటకు తీశారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఏలూరు జిల్లా నూజివీడు మండలం మర్రిబంధం గ్రామం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్డుపై వెళ్తున్న ఆటోపై తాటిచెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల పాప మృతి చెందగా.. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details