ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gutka Seized : ఆ కారులో అన్నీ గుట్కా, పాన్ పరాక్, ఖైనీ ప్యాకెట్లే... ఇద్దరి అరెస్ట్

By

Published : Jun 20, 2021, 7:54 PM IST

గుట్కా, పాన్ పరాక్, ఖైనీ ప్యాకెట్లను కారులో తరలిస్తున్న ఇద్దరు నిందితులను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో సరకుతో పాటు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Gutka Seized : భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
Gutka Seized : భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం శంకరాపురం క్రాస్​ రోడ్డులో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. కర్ణాటక నుంచి కడప జిల్లా రాయచోటికి కారులో తరలిస్తుండగా.. సరుకును గుర్తించిన పోలీసులు.. కారును నిలిపి సోదా చేశారు.

దాదాపు రూ.5 లక్షల విలువ..

అనంతరం కారులో నిషేధిత గుట్కా, పాన్ పరాక్, ఖైనీ ప్కాకెట్లు ఉండటంతో మదనపల్లె స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు సరకుతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు కడప జిల్లా రాయచోటికి చెందిన పఠాన్ మహబూబ్ ఖాన్, మొఘల్ గవర్నర్ బేగ్​లుగా గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి : ETELA: 'ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మే'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details