ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అదుపు తప్పిన వ్యాను... అప్రమత్తమైన డ్రైవర్​

By

Published : Jun 23, 2020, 7:48 PM IST

చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమాదారిలో బొలెరో లగేజ్​ వ్యాను అదుపుతప్పి లోయలో పడింది. అప్రమత్తమైన డ్రైవర్ వ్యానులో నుంచి దూకేయటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

అదుపుతప్పి లోయలో పడిన బొలెరో వ్యాన్​
అదుపుతప్పి లోయలో పడిన బొలెరో వ్యాన్​

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు నుంచి నెల్లూరుకు ప్లాస్టిక్ డ్రమ్ములతో వెళ్తున్న బొలెరో వ్యాను కనుమాదారిలోని దొనకోటి గంగమ్మగుడి మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దూకేయటంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:పిల్ల కోసం గ్రామానికి వచ్చిన తల్లి జింక…కుక్కల దాడి

ABOUT THE AUTHOR

...view details