ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భరత్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Dec 1, 2020, 8:50 PM IST

తిరుపతిలో కలకలం రేపిన భరత్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. లక్ష్మీపురానికి చెందిన శంకర్​ను ఆదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ
హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ

భరత్ హత్య కేసును చేధించిన పోలీసులు

తిరుపతిలో కలకలం రేపిన భరత్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని లక్ష్మీపురానికి చెందిన శంకర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో అతనే భరత్​ను హత్య చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. మృతుడు భరత్, నిందితుడు శంకర్ స్నేహితులు కాగా మరో స్నేహితుడికి వీరికి మధ్య ఏర్పడిన మనస్పర్థలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు తేల్చారు. మంగళవారం సాయంత్రం నిందితుడిని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి అతడి నుంచి హత్యకి వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి తూర్పు పట్టణ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details