ఆంధ్రప్రదేశ్

andhra pradesh

infant child dead body: జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం

By

Published : Dec 6, 2021, 9:16 AM IST

Updated : Dec 6, 2021, 12:36 PM IST

infant child dead body: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం స్థానికులను కలిచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం
జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం

infant child dead body: చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శిశువు మృతదేహం కలకలం రేపింది. ఉదయం బహిర్భూమికి వెళ్తున్న గ్రామస్థులకు మృత శిశువు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శిశువు చెవి, నోటి నుంచి రక్తం వస్తుండడంతో ఎవరో కావాలనే ఎత్తునుంచి పారేసి వెళ్లినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. హైవేపై ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇదీచదవండి:

palle velugu bus colors: పల్లె వెలుగు బస్సులకు కొత్త రంగు

Last Updated : Dec 6, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details