ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు అందని భద్రత

By

Published : Feb 1, 2021, 3:23 PM IST

మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు భద్రత అందని పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులుగా భద్రత కోసం ఏఆర్ సిబ్బందిని పంపించాలని కోరిన.. ఫలితం లేదని జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ యాదవ్ తెలిపారు.

Inadequate security for the accused in the Madanapalle twin murder case
మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు అందని భద్రత

చిత్తూరు జిల్లా మదనపల్లె జంటహత్యల కేసులో నిందితుల తరలింపును వేగవంతం చేయాలని మదనపల్లె సబ్ జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ యాదవ్ కోరారు. సబ్​ జైల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... నిందితులు పద్మజ, పురుషోత్తంలను చూసి తోటి ఖైదీలు భయపడుతున్నారన్నారు.

నిందితులు రాత్రంతా అరుపులు, కేకలతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నా ఆయన.. మదనపల్లె నుంచి విశాఖకు తరలించాలని సూచించారు. రెండు రోజులుగా భద్రత కోసం ఏఆర్ సిబ్బందిని పంపించాలని కోరుతున్న ఫలితం లేదని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: రెబల్స్‌ బుజ్జగింపులకు నేతల మధ్యవర్తిత్వం

ABOUT THE AUTHOR

...view details