ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fire: పలమనేరులో అగ్నిప్రమాదం.. ఆటో మొబైల్‌ దుకాణం దగ్ధం

By

Published : Apr 29, 2023, 4:19 PM IST

Fire accident : చిత్తూరు జిల్లా పలమనేరు.... పలమనేర్ పట్టణంలో రంగబాబు సర్కిల్ వద్ద మర్కస్ కాంప్లెక్స్ లో బిస్మిల్లా ఆటో మొబైల్ అగ్నికీ ఆహుదైందిగుర్తు తెలియని దుండుగులు నిప్పు అంటిచ్చారని అక్కడ ఉన్న ఒక స్థానికుడు చెప్పాడు. అలాగే నెల్లూరు జిల్లా మర్రిపాడు, గంగుంట మలుపు వద్ద చోటు చేసుకున్న వేరువేరు ప్రమాదాల్లో ఇరువురు గాయపడ్డారు.. మర్రిపాడు సమీపంలో ఆగి ఉన్న ఓ లారీని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పాటు అనంతపురం జిల్లాలో యువరైతు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.

Etv Bharat
Etv Bharat

Fire accident in Automobile:చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ ఆటో మొబైల్‌ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుడి సమాచారం ప్రకారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆటో మొబైల్‌ దుకాణానికి నిప్పంటించారని తెలిపారు. అగ్నిప్రమాదంలో దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. లోపల చాలా వరకు ప్లాస్టిక్, రబ్బరు సామగ్రి ఉండటంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. స్థానికులు మంటల్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటికే దుకాణం పూర్తిగా మంటలకు ఆహుతైంది. సుమారు 20 లక్షల విలువ చేసే సామగ్రితోపాటు... 3 లక్షల నగదు కాలిపోయిందని దుకాణం యజమాని తెలిపారు.

నెల్లూరు జిల్లామర్రిపాడు, గంగుంట మలుపు వద్ద రోడ్డుపై ఆయిల్‌ ట్యాంకర్‌కు ప్రమాదం జరగడంతో... ఆ ప్రాంతమంతా ఆయిల్‌ మయమయ్యింది. ఆ విషయం చుట్టుపక్కల ప్రజలకు పాకడంతో.. ఇంకేముంది ఇంట్లో ఉన్న క్యాన్లు, బిందెలు, బకెట్లతో పోటెత్తారు. దొరికినోళ్లకు దొరికినంత ఎత్తుకెళ్లారు. రోడ్డు మొత్తంగా ఆయిల్ మయం కావడంతో ప్రమాదాలు జరగకుండా పోలీసులు.. రోడ్డుపై ఇసుకను తోలించారు. నెల్లూరు కృష్ణపట్నం నుంచి ఆయిల్ ట్యాంకర్ బళ్లారి వెళుతుండగా మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

రెండో ప్రమాదంలో గంగుంట మలుపు సమీపంలో ఓ లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుండి వచ్చిన రెండు లారీలు ఢీకొట్టాయి. అయితే ఈ ప్రమాదం అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బద్వేలు వైపు నుండి నెల్లూరుకు వెళ్తుండగా ఈ మూడు లారీలు ప్రమాదానికి గురయ్యాయి.

విద్యుత్ షాక్​తో యువరైతు మృతి : అనంతపురం జిల్లా గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో శనివారం యువ రైతు బాలు తన విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తుర్కపల్లి గ్రామంలో నివాసం ఉండే బాలు పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం వాము దొడ్డిలో గేదెలకు పాలు పితకడానికి వెళ్లాడు. అయితే నిన్న కురిసిన ఈదురుగాలులో వర్షానికి విద్యుత్ తీగలు వాము దొడ్డిలో పడి ఉన్నాయి. దీంతో గమనించని బాలు విద్యుత్ తీగలను తొలగించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్​కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బాలును చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details