ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏర్పేడు: వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురు రైతుల్లో.. ఒకరు గల్లంతు

By

Published : Nov 26, 2020, 11:35 AM IST

Updated : Nov 26, 2020, 12:21 PM IST

వరద ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురు రైతుల్లో ఒకరు గల్లంతయ్యారు. తమ పొలాల్లో ఉన్న మోటార్లు తీసుకొచ్చేందుకు రైతులు వెళ్లారు. ఆ సమయంలో వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. రైతులను రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ సమయంలోనే ఒక రైతు పట్టుతప్పి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

Farmers trapped in floods in Chittoor district
Farmers trapped in floods in Chittoor district

ఏర్పేడు : వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురు రైతులు

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో రైతులు వరదలో చిక్కుకున్న ఘటనలో ఒక రైతు గల్లంతయ్యాడు. పొలాల్లో నుంచి మోటార్లు బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లిన ముగ్గురు రైతులు ఒక్కసారిగా ఉప్పొంగిన వరదతో ప్రాణాపాయంలో చిక్కుకున్నారు. పోలీసులు రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే ఒకరు పట్టు కోల్పోయారు.

బాధిత రైతులకు ఏర్పేడు మండలంలో స్థానికంగా పొలాలున్నాయి. వరద ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని మోటార్లను బయటకు తీసుకొచ్చేందుకు ముగ్గురూ ఒకేసారి వెళ్లారు. అదేసమయంలో మల్లిమడుగు రిజర్వాయర్ నీటిని విడుదల చేసినందున ఒక్కసారిగా వరద ముంచెత్తి రైతులు ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Last Updated :Nov 26, 2020, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details