ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనుమానాస్పద స్థితిలో.. నవ దంపతులు మృతి!

By

Published : Feb 11, 2021, 5:38 PM IST

చిత్తూరు జిల్లా పాకాలలో నవ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చందారు. పాకాలలోని భారతంమిట్టకు చెందిన అల్తాఫ్‌ హుస్సేన్‌, సమియా.. ఇంటిలోని బాత్రూంలో మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విద్యుదాఘాతమా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Couple_Suspicious_Death at pakala in chittoor district
నవ దంపతులు అనుమానాస్పద మృతి...

చిత్తూరు జిల్లా పాకాలలో నవ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పాకాలలోని భారతంమిట్టకు చెందిన అల్తాఫ్‌ హుస్సేన్‌, సమియా.. ఇంటిలోని బాత్రూంలో చనిపోయి ఉన్నారు. సమియా కే. వడ్డేపల్లి గ్రామ సచివాలయంలో పోలీస్​గా విధులు నిర్వహించగా.. హుస్సేన్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్​గా పనిచేశారు. ఈ క్రమంలో అతని భార్య ఎన్నికల విధులకు రానందున సహోద్యోగులు ఇంటి వద్దకు వెళ్లి ఆరా తీశారు. భార్యాభర్తలిద్దరూ బయటకు రాకపోవడంపై అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తాహసిల్దార్, కుటుంబ సభ్యుల ముందు బాత్​రూం తలుపులను బద్దలు కొట్టారు. భార్యాభర్తలిద్దరూ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఎలెక్ట్రిక్ సాకెట్స్ ఉండటంతో.. విద్యుదాఘాతమా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details