ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Angrau Tirupati Golden Jubilee: ఆగస్టు 10న అంగ్రూ గోల్డెన్ జూబ్లీ స్నాతకోత్సవం.. హాజరుకానున్న గవర్నర్‌, సీఎం

By

Published : Jul 27, 2021, 9:11 AM IST

తిరుపతిలో ఆగస్టు 10న అంగ్రూ గోల్డెన్ జూబ్లీ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ , సీఎం జగన్ హాజరు కానున్నారు.

cm visit  tirupati
cm visit tirupati

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (అంగ్రూ) 50వ స్నాతకోత్సవాన్ని ఆగస్టు 10న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల వేదికగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు.

అంగ్రూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.గిరిధర్‌కృష్ణ, డీన్‌ డాక్టర్‌ ఎ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పి.సుధాకర్‌, ఎస్టేట్‌ అధికారి పి.వి.నరసింహారావు సోమవారం తిరుపతికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. స్నాతకోత్సవ నిర్వహణ కమిటీలతో సమావేశమై కార్యక్రమ ప్రణాళికపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details