ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మొదలైన పశువుల పండగ.. ఇద్దరు యువకులకు గాయాలు

By

Published : Jan 10, 2021, 5:24 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో పశువుల పండగ వైభవంగా ప్రారంభమైంది. కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ వేడుకలో ఓ విలేకరికి స్వల్ప గాయాలు కాగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

bull festival in kothasanambatla
కొత్తశానంబట్లలో పశువుల పండగ

తమిళనాట జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్​లో పశువుల పండగగా పిలుచుకునే ఉత్సవం.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో ఈ రోజు ప్రారంభమైంది. తరతరాలుగా నిర్వహించుకునే వేడుక కోసం ఉదయాన్నే పశువులను పూజించి.. వాటి కొమ్ములకు నిర్వాహకులు రంగులు అద్దారు. పోలీసుల హెచ్చరికలు లెక్కచేయకుండా.. దేవుళ్లు, రాజకీయ, సినీ ప్రముఖుల చిత్రపటాలు వాటి కొమ్ములకు కట్టి రంగంలోకి దించారు. డప్పుల మోతకు ఎద్దులు పరుగెడుతుంటే.. వాటిని నిలువరించేందుకు రోడ్డుకు ఇరువైపులా యువకులు బారులు తీరి పోటీ పడ్డారు. వారిలో కొందరు పలకలు దక్కించుకుని కేరింతలు కొట్టారు.

కొత్తశానంబట్లలో పశువుల పండగ

దోర్ణకంబాల గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తిని ఎద్దు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో అతడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మరో టీవీ విలేకరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉన్నారు.

ఇదీ చదవండి:ఎల్లంపల్లి ఆంజనేయస్వామి ఆలయం తలుపులు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details