ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొవిడ్ వ్యాక్సిన్​ భద్రపరిచేందుకు అధికారుల ఏర్పాట్లు

By

Published : Dec 14, 2020, 10:51 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ వచ్చేలోగా..వాటిని భద్రపరిచేందుకు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ నిల్వచేసేందుకు అవసరమైన పరికరాలతో పాటు అందుకోసం ప్రత్యేక గదిని ఎంపిక చేశారు. రానున్న రోజుల్లో ఇక్కడ వ్యాక్సిన్ భద్రపరచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కొవిడ్ వ్యాక్సిన్​ భద్రపరిచేందుకు అధికారుల ఏర్పాట్లు
కొవిడ్ వ్యాక్సిన్​ భద్రపరిచేందుకు అధికారుల ఏర్పాట్లు

చిత్తూరు జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్లను భద్రపరిచేందుకు తిరుపతిలోని రుయా ఆసుపత్రిని అధికారులు ఎంపిక చేశారు. పిడియాట్రిక్స్ భవనం పక్కనున్న రోగుల సహాయకులు వేచి ఉండే గదిని వ్యాక్సిన్ కోసం ఎంపిక చేశారు. ఇందులో వ్యాక్సిన్లు భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజర్​లను వారం రోజుల్లో తీసుకురానున్నట్లు వైద్య అధికారులు స్పష్టం చేశారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ముందుగా ఆరోగ్య వర్కర్లు, కొవిడ్ వారియర్లు, 50 ఏళ్లకు పైబడిన వారికి వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details