ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తాజ్‌మహల్‌ కృష్ణానది పక్కన ఉండుంటే..! నాని వ్యంగ్యాస్త్రాలు'

By

Published : Jun 27, 2019, 9:17 AM IST

మొన్నటికి మొన్న ప్రజావేదిక కూల్చివేత ఆలోచన తప్పు పట్టిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.... మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజ్‌మహల్‌తో లింకు పెట్టి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

ప్రజావేదిక కూల్చివేతపై కేశినేని వ్యంగ్యాస్త్రాలు

సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య యాక్టీవ్‌గా కనిపిస్తున్న విజయవాడ ఎంపీ... ప్రజావేదిక కూల్చివేత అంశంపై విమర్శలు గుప్పించారు. తాజ్ మహల్... ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయిందని... లేకుంటే ఏమయ్యేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే మాత్రం ప్రజావేదికలా నేలమట్టమయ్యేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి సంబంధించిన ఫొటోలనూ తన పోస్టులో పెట్టారాయన.

Intro:ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేత అంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. Body: ప్రజా వేదిక నిర్మాణం కూల్చివేత పై స్పందించిన ఆయన విజయ వేదిక నిర్మాణాన్ని తెదేపా హయాం కంటే ముందే నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో లో ఇది ఒక్కటే అక్రమ నిర్మాణం అన్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహం చూపడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో రైతులు మూడు నెలలుగా అమ్మిన ధాన్యానికి డబ్బు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Conclusion:రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు ఒక కంకిపాడు మండలానికి పంపిన ధాన్యం లో ఒక గ్రామానికి కూడా సరిపోయేలా లేవన్నారు రైతులు నారుమడులు పోవాలంటే కాలువలో నీరు లేదన్నారు వాలంటీర్లు పేరుతో రేషన్ డీలర్లు విధానాన్ని రద్దు చేయడం సరైన పద్ధతి కాదని దీనిపై ముఖ్యమంత్రి మరోమారు పరిశీలించుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details