ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మావోయిస్టు సమస్యలపై బుగ్గన నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ

By

Published : Jul 15, 2019, 4:38 PM IST

రాష్ట్రంలో నక్సల్స్ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనపై మంత్రి వర్గ ఉపసంఘం ఆర్థికమంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటుచేశారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం ఉంటుంది. హోం, రెవెన్యూ, గిరిజన సంక్షేమం, రహదారులు భవనాల శాఖ సభ్యులుగా ఇందులో ఉంటారు. లొంగిపోయిన నక్సల్స్ పునరావాసం, తీవ్రవాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపులో విధాన రూపకల్పన, ధ్వంసం అయిన ఆస్తులకు పరిహారం తదితర అంశాల్లో మంత్రి వర్గ ఉపసంఘం సమీక్షించనుంది. నక్సల్స్ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు. ఈ కమిటీ సిఫార్సులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి... అమలు చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

Intro:FILE NAME : AP_ONG_42_15_BJP_KANNA_LAKSHMINARAYANA_SABYATWA_NAMODU_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యున్నతస్థాయిలో నిలిచిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.. ప్రకాశం జిల్లా చీరాల లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు..... ఈసందర్భరంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి ఒక్క భాజపా తోనే సాధ్యమని ఎన్నికల సమయంలో రెండు ప్రాంతీయ పార్టీలు బిజెపి పై దుష్ప్రచారం చేశారని...ఆంద్ర ప్రదేశ్ లోని రెండు ప్రాంతీయ పార్టీలు అవినీతిలో కురుకుపోయాయన్నారు... రాష్ట్రంలో అమలు చేసిన పధకాలన్నీ కేంద్రప్రభుత్వం అమలుచేసినవేనని... తామే అమలు చేసినట్లు గత ప్రభుత్వం చెప్పుకుందని అవినీతి రహిత ఆంద్రప్రదేశ్ ను చేయటమే భాజపా లక్ష్యమని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు... కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పలువురు భాజపా లో చేరారు.... కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..






Body:బైట్ : కన్నా లక్ష్మీనారాయణ - బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు.



Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748 , ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ :, 9866931899

ABOUT THE AUTHOR

...view details